ఎస్సీ వర్గీకరణ కోసం రేపటి నుంచి మాదిగ సంగ్రామ యాత్ర చేస్తామని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించటంలో కేంద్రం విఫలమైందన్నారు. దీనికి నిరసనగా మాదిగ సంగ్రామ యాత్ర చేస్తున్నామన్నారు. 119 నియోజకవర్గాల్లో యాత్ర చేస్తామన్నారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం పగటి కలే అన్నారు.
మరిన్ని వార్తల కోసం
