‘సీతారామం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. హీరోయిన్‌గా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే మరోవైపు స్పెషల్ సాంగ్‌తోనూ ఆడియెన్స్‌ను అలరించడానికి రెడీ అవుతోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ‘పెద్ది’ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో మృణాల్ కనిపించనుందట.
ఈ పాట కోసం ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించగా, ఫైనల్‌గా ఆమెను ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ సాంగ్‌లో చరణ్, మృణాల్‌తోపాటు హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా స్టెప్స్ వేయనుందని టాక్ వినిపిస్తోంది. ముగ్గురి డ్యాన్స్ మూమెంట్స్‌తో ఈ సాంగ్ కచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్‌తో మొత్తం చిత్రీకరణ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ కానున్నాయి. ఏప్రిల్ 30న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. మరోవైపు మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న చిత్రంతో పాటు నాలుగు హిందీ సినిమాల్లో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
