
అంతర్జాతీయ క్రికెట్‌లో 15 సంవత్సరాలు పూర్తి
భారతీయులకు మహేంద్రసింగ్ ధోని పరిచయం లేని పేరు. క్రికెట్‌లో రారాజు. తన హెలికాప్టర్ షాట్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గబ్బర్. భారత్‌కు ఒక ప్రపంచకప్‌ను అందించిన జార్ఖండ్ డైనమేట్. అభిమానులందరూ ముద్దుగా ‘మహీ’ అని పిలుచుకునే ధోని 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ధోని ఆ మ్యాచ్‌లో రన్ చేయబోయి డకౌట్‌గా వెనుదిరిగాడు. తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో మంచి ఆరంభం ఇవ్వలేకపోయినా.. ఆ తర్వాత ధోని తనదైన ఆటతో వీరవిహారం చేసి అన్నిఫార్మాట్లలో కలిపి 17,266 పరుగులు చేశాడు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా ప్రశంసలు పొందిన ధోని దేశానికి ఎన్నో పురస్కారాలను తెచ్చాడు. ధోని ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2011 లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఇండియా 1984లో చివరిసారిగా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2011లో ధోని నాయకత్వానా మరోసారి ఆ టైటిల్‌ను చేజిక్కుంచుకుంది. భారత్ ఈ కప్పు గెలవడంలో ధోని పాత్ర ఎంతో కీలకం. 2007లో మొదలైన ఐసీసీ వరల్డ్ టి20 కప్పును ధోని నాయకత్వంలోనే ఇండియా గెలుచుకుంది. ఆ మ్యాచ్‌లో ఇండియా, పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాలో ఓడించింది. ఆ తర్వాత 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ధోని నాయకత్వంలోనే భారత్ గెలుచుకుంది. 2010 మరయు 2016 ఆసియా కప్పులను కూడా ధోని తన నాయకత్వంలోనే భారత్ ఖాతాలో వేశాడు.
అయితే, 2019 వరల్ఢ్ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ తర్వాత ధోని మళ్లీ భారత్ తరపున మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఆ మ్యాచ్‌లో భారత్ కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ధోని ఉండటంతో అభిమానుల్లో ఆశలు సజీవంగా ఉన్నాయి. కానీ, ధోని కూడా రనౌట్ కావడంతో ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచింది. ఆ సెమీ-ఫైనల్లో భారత్, న్యూజిలాండ్‌తో పోటీపడి 18 పరుగుల తేడాలో ఓడిపోయింది.