IPL 2024: ఇతనికి వయసుతో సంబంధం లేదు: భారీ సిక్సర్లతో విరుచుకుపడిన ధోనీ

IPL 2024: ఇతనికి వయసుతో సంబంధం లేదు: భారీ సిక్సర్లతో విరుచుకుపడిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వయసు రోజు రోజుకు వెనక్కి వచ్చేస్తుంది. కెరీర్ ప్రారంభంలో ఎంత ఫిట్ గా ఉన్నాడో.. ప్రస్తుతం అంతే ఫిట్ గా అదరగొడుతున్నాడు. బ్యాటింగ్ లో కూడా తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ఇంకా ఐపీఎల్ స్టార్ట్ కాకపోయినా సిక్సులతో చెన్నై స్టేడియంలో శివాలెత్తించాడు. తన బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో చెపాక్ మైదానంలో భారీ సిక్సర్లు కొడుతూ తనలో ఇంకా పదును తగ్గలేదని నిరూపించాడు. స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లనే తేడా లేకుండా బంతిని బౌండరీ దాటిస్తున్నాడు. 

ఈ వీడియో చూసిన సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సారి ధోనీ రెచ్చిపోవడం ఖాయం అంటున్నారు. ఇటీవలే ధోనీ న్యూ సీజన్, న్యూ రోల్ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ రోల్ ఏంటో అర్ధం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న ధోనీ కీపింగ్ కు గుడ్ బై చెబుతాడని కొంతమంది అంటుంటే.. ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేంద్రుడి ఆట చూస్తుంటే ఓపెనర్ గా వచ్చి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. 

ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 5 సార్లు టైటిల్స్ గెలుచుకుంది. 2010, 2011, 2018, 2021,203 లో మాహీ చెన్నైకు  టైటిల్స్ అందించాడు. గత ఏడాది ఛాంపియన్ గా నిలిచిన చెన్నై.. 2024 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. మార్చి 22 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తమ తొలి మ్యాచ్ తో ఈ సీజన్ ప్రారంభమవుతుంది.