ఫ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ కు ఫిదా అయిన ధోని.. మినియేచర్ గిఫ్ట్ పై ఆనందం

ఫ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ కు ఫిదా అయిన ధోని.. మినియేచర్ గిఫ్ట్ పై ఆనందం

భారత లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. అన్ని తరాల వారు ఆయనకు అభిమానులుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆ అభిమానాన్ని, ప్రేమను ఏ ఫ్యాన్ వెరైటీగా చాటుకున్నారు. ధోనికి చెన్నైలోని చెపాక్ స్టేడియం మినియేచర్ మోడల్‌ను బహుమతిగా ఇచ్చారు. అభిమాని ఇచ్చి గిఫ్ట్ కు ఫిదా అయిన ధోని.. ఆనందంతో మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోలో ధోని చిరునవ్వులు చిందిస్తూ మినిమేచర్ మోడల్ పైనుంచి తన దృష్టిని మరల్చుకోలేకపోయారు. ఈ స్టేడియంలో లైట్లు కూడా వెలగడం చూసి ధోని ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఇంతకుమునుపెవరూ ఇలాంటి బహుమతులు ఇవ్వలేదన్న తరహాలో ఆయన పండించిన ఎక్స్ ప్రెషన్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధోని ఆనందాన్ని చూసిన ఫ్యాన్స్.. అతని చిరునవ్వుకు పడిపోతున్నారు. బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/reel/CsVEYaqtVqs/?utm_source=ig_embed&ig_rid=0018cea3-09c8-4a8d-961d-a3adaecc75e5