MS Dhoni: ఐపీఎల్ 2026 సీజన్ అంతటా మైదానంలో కనిపించకుండా అభిమానులను ఊరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీ ఎట్టకేలకు తిరిగి మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడా? అంటే 'అవును' అనే సమాధానమే వినిపిస్తోంది. సోమవారం (మే 18న ) చెన్నైలోని చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరగబోయే కీలకమైన మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగే అవకాశం ఉందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హింట్ ఇచ్చాడు.
ఈ సీజన్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయం (Calf Injury) కారణంగా ధోనీ అన్ని మ్యాచులకు పూర్తిగా దూరమయ్యాడు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌కు కూడా ధోనీ వెళ్లకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలాంటి సమయంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ధోనీ ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
ధోనీ పునరాగమనంపై అశ్విన్ వ్యాఖ్యలు:
ధోనీ ప్రస్తుత శారీరక స్థితిపై అశ్విన్ సానుకూలంగా స్పందించాడు. చెపాక్‌లో సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ తుది జట్టులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేశాడు. ఇప్పటికీ క్వాలిటీ పేస్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొనే హిట్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ధోనీనే.. మిడిల్ ఆర్డర్, డెత్ ఓవర్లలో రన్ రేట్ పెంచడానికి చెన్నైకి ధోనీ అవసరం ఎంతో ఉంది.. నాకైతే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆడే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.. నాకు తెలిసిన సమాచారం ప్రకారం.. అతను గత 2, 3 మ్యాచుల నుంచే బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడని అశ్విన్ పేర్కొన్నాడు.
సీఎస్కే మేనేజ్‌మెంట్‌కు అశ్విన్ సపోర్టు:
మహేంద్ర సింగ్ ధోనీ గాయం, రికవరీ ఆలస్యం కావడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై అశ్విన్ స్పందించాడు. ఇందులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ లేదా హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పు ఏం లేదని స్పష్టం చేశాడు. గాయాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కొందరు ఆటగాళ్లు ట్రెయినింగ్ తగ్గించి, నేరుగా మ్యాచ్‌లే ఆడాలని చూస్తారు.. కానీ స్పోర్ట్స్ సైన్స్ ప్రకారం ట్రెయినింగ్ తగ్గిస్తే గాయాలయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయి.. ఇది పూర్తిగా ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ సైన్స్‌కు సంబంధించిన విభాగం.. ఇందులో కోచ్ లేదా కెప్టెన్‌ను నిందించడం కరెక్ట్ కాదు, వారు ఏమీ చేయలేరని ఆర్. అశ్విన్ మేనేజ్‌మెంట్‌ను సమర్థించాడు.
సీఎస్కేకు ధోనీ ఎందుకు అవసరం?:
ధోనీ గైర్హాజరీలో చెన్నై ఈ సీజన్ అంతటా ఘోర ఓటములని చవి చూసింది. వికెట్ల వెనుక సంజు శాంసన్‌పై ఆధారపడాల్సి వచ్చింది. లోయర్ ఆర్డర్‌లో యంగ్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ డెత్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోయాడు. ఇలాంటి స్థితిలో ఫినిషర్‌గా, అలాగే ఫీల్డ్ టాక్టీషియన్‌గా ధోనీ రీఎంట్రీ ఇస్తే.. మిగిలిన రెండు లీగ్ మ్యాచుల్లో చెన్నైకి కొండంత బలం చేకూరడం ఖాయంగా కనిపిస్తుంది.
ప్లేఆఫ్స్ బరిలో నిలవాలంటే:
లక్నో చేతిలో ఓటమితో చెన్నై పాయింట్ల పట్టికలో +0.027 నెట్ రన్‌రేట్‌తో 6వ స్థానంలో పడిపోయింది. అయినప్పటికీ, టైటిల్ డిఫెన్స్ రేసులో జట్టును ఇంకా సజీవంగా ఉంచినందుకు రుతురాజ్ సేనను రవిచంద్రన్ అశ్విన్ అభినందించాడు. మరి సోమవారం సన్‌రైజర్స్‌పై ధోనీ ఫ్యాన్స్‌కు 'ఫెయిరీ టేల్' గిఫ్ట్ ఇస్తాడో లేదో అనేది వేచి చూడాలి!
🚨 SOMEBODY PLEASE DECODE THIS 🚨 🚨
— TheFakeFakeer (@TheFakeFakeer) May 15, 2026
Vimal Kumar asks R. Ashwin about MS Dhoni playing the last game in Chennai & Ash responds in a Crypted style 😂
Vimal: Will Thala play at Chennai in the crucial game for CSK ??
R. Ashwin: I'll jus say, "HO JAYEGA" 😆 @ashwinravi99… pic.twitter.com/SYUl7wKCxZ
