మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ 2023 కోసం అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ధోని ఇటు టీమిండియాను, అటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజయతీరాలకు నడిపించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. చెన్నై జట్టుకు నాలుగు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ గా ధోని ప్రత్యేక మైన గుర్తింపును సంపాధించుకున్నాడు. ఐపీఎల్ 2023 కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాడు. ప్రస్తుతం రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (జేఎస్సీఏ)లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
