
క్రికెటర్ ఎం.ఎస్ ధోని నిర్మాతగా మారి.. తన భార్య సాక్షితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ఎల్.జి.ఎం’ (లవ్ గేట్స్ మ్యారీడ్). రమేష్ తమిళ్ మణి దర్శకుడు. హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా లీడ్ రోల్స్ చేశారు. ఆగస్టు 4న తెలుగు, తమిళ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్.ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానర్స్ విడుదల చేస్తున్నాయి.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ఆసక్తిగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. క్రికెట్ ప్రపంచంలో లెజెండ్ అయిన ధోని గారు.. అలాంటి సక్సెస్‌ను సినిమా రంగంలోనూ సాధించాలని కోరుకుంటున్నా. సాక్షి గారికి ఆల్ ది బెస్ట్’ అని చెప్పాడు. ‘తెలుగు ప్రేక్షకులు సినిమాను పండుగలా సెలబ్రేట్ చేస్తారు.
అందుకే ఇక్కడి ఆడియెన్స్‌కి నేను పెద్ద అభిమానిని’ అని చెప్పాడు హరీష్. ధోనిగారి ప్రొడక్షన్‌లో నటించడం ఎంతో స్పెషల్ అంది ఇవానా. సాక్షి ధోని మాట్లాడుతూ ‘ధోని నుండి వస్తున్న మరో సర్‌ప్రైజ్ ఇది. ఇద్దరం చాలా సినిమాలు చూస్తాం. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వచ్చాం. ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి కథ ఇది. రిలేషన్షిప్స్ గురించి చూపించాం. ఇంకా మరెన్నో సినిమాలను చేయటానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగులో నేను అల్లు అర్జున్‌కి పెద్ద ఫ్యాన్‌ని’ అన్నారు. నదియా, త్రిపుర పసుపులేటి, ఆర్.జె.విజయ్ పాల్గొన్నారు.