నాకు వాళ్లు చాలా రెస్పెక్ట్​ ఇస్తారు

నాకు వాళ్లు చాలా రెస్పెక్ట్​ ఇస్తారు

న్యూఢిల్లీప్రజలు, మీడియా తమ గురించి ఎలా మాట్లాడుకున్నా.. టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ, మాజీ కెప్టెన్‌‌ మహేంద్ర సింగ్‌‌ ధోనీ తనకు చాలా రెస్పెక్ట్‌‌ ఇస్తారని ఇండియా చీఫ్‌‌ సెలెక్టర్‌‌ ఎమ్మెస్కే ప్రసాద్‌‌ చెప్పాడు. వారిద్దరితో తనది చెక్కు చెదరని బంధమని అన్నాడు. కొద్ది రోజుల్లో తన పదవీకాలం ముగించుకోనున్న ప్రసాద్‌‌.. తన పనితీరు, కోహ్లీ, ధోనీతో రిలేషన్‌‌షిప్‌‌ గురించి మాట్లాడాడు. ‘నా టర్మ్‌‌లో లెజెండరీ క్రికెటర్ల సలహాలు తరచూ తీసుకునేవాడిని. అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. ధోనీ, కోహ్లీతో నాది చెక్కుచెదరని బంధం. మా గురించి ప్రజలు ఏమైనా అనుకొని ఉండొచ్చు. కానీ, కోహ్లీ, ధోనీతోఎప్పుడు మాట్లాడినా వాళ్లు ఎంత రెస్పెక్ట్‌‌ ఇచ్చేవాళ్లో నాకు తెలుసు’అని చెప్పుకొచ్చాడు. మేనేజ్‌‌మెంట్‌‌ స్టూడెంట్‌‌ అయిన తనకు ఎవరిని ఎలా డీల్‌‌ చేయాలో బాగా తెలుసని ఎమ్మెస్కే చెప్పాడు. ఆంధ్ర క్రికెట్‌‌ అసోసియేషన్‌‌లో క్రికెట్‌‌ డైరెక్టర్‌‌గా ఉన్నప్పుడు చాలా పెద్ద ఇష్యూస్‌‌ను డీల్‌‌ చేశానని తెలిపాడు. ‘ఆంధ్ర అసోసియేషన్‌‌లో పని చేస్తున్నప్పుడు చాలా ఒత్తిడిని తట్టుకొని వచ్చిన నాకు బీసీసీఐలో పని అంత కష్టంగా అనిపించలేదు. . ఇండియా–-ఎ మేనేజ్‌‌మెంట్‌‌, టీమిండియా మేనేజ్‌‌మెంట్‌‌, నేను కూర్చొని ఒక్కో ప్లేయర్‌‌ (జూనియర్) ప్రోగ్రెస్‌‌ గురించి చర్చించేవాళ్లం. సీనియర్‌‌ టీమ్‌‌ అవసరాలకు తగ్గట్టు క్రికెటర్లను తీర్చిదిద్దామ’ని ప్రసాద్‌‌ చెప్పుకొచ్చాడు.

టెస్టుల్లోకి బుమ్రా.. అతి పెద్ద విజయం

తమ టర్మ్‌‌లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఎమ్మెస్కే అన్నాడు. లిమిటెడ్‌‌ ఓవర్ల స్పెషలిస్ట్‌‌గా ముద్రపడ్డ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాను టెస్టుల్లోకి తీసుకోవడం తమ ప్యానెల్‌‌ సాధించిన అతి పెద్ద విజయమని చెప్పాడు. ‘బ్రుమా టెస్టులు ఆడగలడని ముందుగా ఎవరూ అనుకోలేదు. తనలాంటి బౌలర్‌‌ విదేశాల్లో పనికొస్తాడని సెలెక్టర్లు, టీమ్‌‌మేనేజ్‌‌మెంట్‌‌ గుర్తించాక.. మేం అతడి ఫిట్‌‌నెస్‌‌, పెర్ఫామెన్స్‌‌ మెరుగుపరచడంపై దృష్టిపెట్టాం. లిమిటెడ్‌‌ ఓవర్లలో అతనికి రెస్ట్‌‌ ఇచ్చి రంజీల్లో ఆడించాం. ఆ తర్వాతే సౌతాఫ్రికా టూర్‌‌కు సెలెక్ట్‌‌ చేశాం. ఇలా ప్లాన్‌‌ ప్రకారం ముందుకెళ్లి ఫలితం రాబట్టాం. హార్దిక్‌‌ పాండ్యాను టెస్టుల్లోకి తీసుకొచ్చేముందు కూడా ఇలాంటి ప్లానింగ్‌‌నే అనుసరించాం. బుమ్రా మాదిరిగా టీ20 బ్యాక్‌‌గ్రౌండ్‌‌ నుంచి వచ్చిన పాండ్యా కూడా టెస్టు క్రికెట్‌‌కు పనికొస్తాడని ఎవరూ అనుకోలేదు’అని ఎమ్మెస్కే వివరించాడు.