హైదరాబాద్ కు చెందిన ఓ ఫార్మా కంపెనీ కరోనా వైరస్ ను అంతం చేసే ట్యాబ్లెట్ల ను కేవలం రూ.33కే అందిస్తున్నట్లు ప్రకటించింది.
మనదేశంలో పలు ఫార్మాకంపెనీలు కరోనా వైరస్ వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్నాయి. ఆ పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నట్లు తెలుస్తోంది. పరిశోధనలు చివరి దశలో ఉండగా..ఆయా సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సిన్, టాబ్లెట్ ఎంత ఖరీదు అవుతుందనే విషయాల్ని వెల్లడిస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్ కు చెందిన ఫార్మాకంపెనీ ఎంఎస్ఎన్ కరోనా ను నయం చేసే ట్యాబ్లెట్లను అతితక్కువ ధరకే అమ్ముతున్నట్లు ప్రకటించింది.
200ఎంజీ మోతాదులో ఉన్న ఒక్కో ట్యాబ్లెట్ ఖరీదు రూ.33 కే అందిస్తున్నట్లు చెప్పారు. డిమాండ్ కు తగ్గట్లు 400ఎంజీ మోతాదులో ట్యాబ్లెట్లను అందుబాటులోకి
తెస్తామని తెలిపింది.
జెన్‌బర్క్ట్ ఫార్మాస్యూటికల్స్ 200ఎంజీ ఫావిపిరవిర్ ను ఒక్కో ట్యాబ్లెట్ ను రూ.39 అమ్ముతుంది. గ్లెన్ మార్క్ ఫార్మా సంస్థ ఫావిపిరవిర్ ను ఒక్కో ట్యాబ్లెట్ ను రూ.103కే విడుదల చేసింది. ఆ తరువాత రూ.103 ఉన్న ట్యాబ్లెట్ ను రూ.75 కి తగ్గించింది. దీంతో పాటు సిప్లా ఫార్మాకు చెందిన సిప్లెంజా ట్యాబ్లెట్ ధర రూ .68గా ఉంది. హెటెరో ల్యాబ్స్ ఫావివిర్ మరియు బ్రింటన్ ఫార్మాస్ కు చెందిన ఫావిటన్ ధర రూ.59 ఉంది.
