రైతులను విపక్షాలే రెచ్చగొడుతున్నాయ్

రైతులను విపక్షాలే రెచ్చగొడుతున్నాయ్

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కావాలనే రెచ్చగొడుతున్నాయని కేంద్రం మండిపడింది. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన మూడో రౌండ్ చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చల్లో భాగంగా కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే అగ్రి చట్టాల్లో మార్పులకు కేంద్రం సిద్ధంగానే ఉందని, కానీ ఆ చట్టాలను తొలగించాలని రైతులు కోరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 9న (బుధవారం) రైతులతో కేంద్రం మరో దఫా చర్చలు నిర్వహించనుంది. ఇదిలా ఉండగా మంగళవారం తలపెట్టిన భారత్ బంద్‌‌ను కొనసాగిస్తున్నామని రైతు సంఘాల నాయకులు తెలిపారు.