
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్‌ను మూడోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ముదిరాజ్‌లపై ఉందని ఆ పార్టీ లీడర్ కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక ముదిరాజ్‌లకు కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తారని చెప్పారు.
బుధవారం తెలంగాణ భవన్‌లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల తర్వాత ముదిరాజ్ కుటుంబాలకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. అందరికీ రాజకీయాల్లో సముచిత స్థానం ఇస్తామని కేసీఆర్ మాట ఇచ్చారని తెలిపారు.