Muhammud Siraj : డాట్ బాల్స్లో సిరాజ్ నంబర్-1

Muhammud Siraj : డాట్ బాల్స్లో సిరాజ్ నంబర్-1

ఐపీఎల్ 2023 సీజన్ లో మహమ్మద్ సిరాజ్ రెచ్చిపోతున్నాడు. తన సూపర్ బౌలింగ్ తో బెంగళూరు టీంకు వెన్నెముకలా నిలబడుతున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు చుక్కలు చూపిస్తున్నాడు. సిరాజ్ ఈ సీజన్ లో ఇప్పటివరకు 6 మ్యాచ్ ఆడి 24 ఓవర్లు బౌలింగ్ వేశాడు. అందులో అత్యధికంగా 81 డాట్ బాల్స్ ఇచ్చాడు.  ప్రస్తుతం ఈ సీజన్ లో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా నంబర్ 1 స్థానంలో నిలిచాడు. 

అంతేకాకుండా.. పవర్ ప్లేలో 72 బంతులేసిన సిరాజ్.. 51 బంతులకు పరుగులివ్వకుండా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అలాగే, 7 ఎకానమీతో 12 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ సిరాజ్ దగ్గరే ఉంది. సిరాజ్ తర్వాత తర్వాతి స్థానాల్లో షమీ (65), జోసెఫ్ (48), మార్క్ ఉడ్(48), అర్షదీప్ (45), భువనేశ్వర్ (45), రషీద్ ఖాన్ (45) ఉన్నారు.