రూ.20 కోట్లు చెల్లించకపోతే కాల్చివేస్తాం.. ముఖేష్ అంబానీకి బెదిరింపు మెయిల్

రూ.20 కోట్లు చెల్లించకపోతే కాల్చివేస్తాం.. ముఖేష్ అంబానీకి బెదిరింపు మెయిల్

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి అక్టోబర్ 27న బెదిరింపు మెయిల్ వచ్చింది. రూ.20 కోట్లు చెల్లించకపోతే కాల్చివేస్తామని ఆగంతకులు ఈ మెయిలో హెచ్చరించారు. ఈ క్రమంలో ముంబైలోని గామ్‌దేవి పీఎస్‌లో IPC 387, 506 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తమకు రూ. 20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని, భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు తమ వద్ద ఉన్నారని గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిలో తెలిపినట్టు పోలీసులు చెప్పారు.