అంబానీ ఫ్యామిలీకి బెదిరింపులు.. విచారిస్తున్న పోలీసులు

V6 Velugu Posted on Feb 27, 2021

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న ఓ ఎస్‌‌యూవీని పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో పోలీసులు విచారణ చేపట్టగా.. అంబానీ కుటుంబాన్ని బెదిరించేందుకు ఇలా చేశారని, ఇందులో రెండు వెహికిల్స్‌‌ను వాడారని తేలింది. ఆ వాహనాల్లో నుంచి 20 గెలాటిన్ స్టిక్స్‌‌తోపాటు కొన్ని నంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని నంబర్ ప్లేట్లు అంబానీ ఫ్యామిటీ సెక్యూరిటీ టీమ్‌‌ వాడిన నంబర్ ప్లేట్లను పోలి ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసును లోతుగా విచారించడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్‌‌ను ముంబై పోలీసులు రంగంలోకి దింపారు. వందలాది సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారని, అలాగే 15 మంది అనుమానితులను ప్రశ్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Tagged investigation, POLICE, Reliance, family, Cctv Footage, mukhesh ambani, Threaten

Latest Videos

Subscribe Now

More News