ముఖ్య గమనిక.. సోషల్ మీడియా మాయలో అల్లు అర్జున్ కజిన్ విరాన్

ముఖ్య గమనిక.. సోషల్ మీడియా మాయలో అల్లు అర్జున్ కజిన్ విరాన్

అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి(Viran Muttamshetty) హీరోగా సినిమాటోగ్రాఫ‌‌ర్ వేణు ముర‌‌ళీధ‌‌ర్(Venu Muralidharan) ద‌‌ర్శకుడిగా ప‌‌రిచ‌‌య‌‌మ‌‌వుతున్న చిత్రం ముఖ్య గమనిక(Mukhya Gamanika). లావణ్య(Lavanya) హీరోయిన్‌‌. రాజ‌‌శేఖ‌‌ర్‌‌(Rajashekhar), సాయికృష్ణ(Sai Krishna) నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 23న సినిమా విడుదల కానుంది.  ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  సోషల్ మీడియా ఉచ్చులో పడి  చిక్కుల్లో పడేవారికి మెసేజ్ ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌కి అతిథిగా హాజరైన నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ‘విరాన్‌‌ యంగ్ ఏజ్ నుంచి మాతో పాటు ట్రావెల్ అవుతూ వ‌‌చ్చాడు. ఆ త‌‌ర్వాత నాతో పాటు అల్లు అర్జున్‌‌గారి సినిమా క‌‌థ‌‌లు వినేవాడు. బ‌‌న్నీ గారికి విరాన్ అంటే  చాలా ఇష్టం. విరాన్ హీరో అవుతా అని 9ఏళ్ల క్రిత‌‌మే నాకు చెప్పాడు. ఈ రోజు త‌‌న క‌‌ల నిజ‌‌మైంది. ఆడియెన్స్ తనని ఆద‌‌రిస్తార‌‌ని న‌‌మ్ముతున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. ఈ సినిమా తనకు బెస్ట్ డెబ్యూ అవుతుందని  చెప్పాడు విరాన్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని దర్శక నిర్మాతలు చెప్పారు.