ముకర్రమ్ ఝా మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

ముకర్రమ్ ఝా మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్ సంస్థానం  ఆఖరి నిజాం.. ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’  మనుమడు ముకర్రమ్ ఝా మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ముకర్రమ్ ఝా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారిని ఆదేశించారు. 

ముకర్రమ్ ఝా టర్కీలోని ఇస్తాంబుల్ లో శనివారం రాత్రి మరణించారు. ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ చేరుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియలు నిర్వహించాల్సిన స్థలం, సమయాన్ని నిర్ణయించనున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్ ను ఆదేశించారు.