భీమదేవరపల్లి, వెలుగు: సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల్లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ఆదర్శ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని జి.శ్రీనిధి ప్రతిభ కనబర్చి, గోల్డ్ మెడల్ సాధించింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రెహమాన్ మాట్లాడుతూ శ్రీనిధి తన ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణమన్నారు. అనంతరం విద్యార్థినిని సన్మానించారు. కాగా, శ్రీనిధి సాధించిన విజయంపై పాఠశాల విద్యార్థులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
