మెదక్ పట్టణంలో కొందరి ఓవర్ యాక్షన్ వల్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందన్నారు మల్టీజోన్ ఐజీ రంగనాథ్. గొడవలు, దాడులకు కారణమైన ఎవ్వరినీ వదిలిపెట్టమన్నారు. వర్గాలు, పార్టీలకు సంబంధం లేకుండా అందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న జరిగిన ఇరువర్గాల ఘర్షణలో అమాయకులు నష్టపోయారన్నారు.
ఇప్పటివరకు కొందరినీ అదుపులోకి తీసుకున్నాం.. బాధ్యులైన వారందరినీ అరెస్ట్ చేస్తామన్నారు ఐజీ రంగనాథ్. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను పెట్టొద్దని సూచించారు. ఆదివారం జరిగే నల్లపోచమ్మ, సోమవారం జరిగే బక్రీద్ పండగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు మల్టీ జోన్ ఐజీ రంగనాథ్.