మేడారం మహాజాతర రోడ్డు పనులు పూర్తి చేయాలి : ఎస్పీ రామ్నాథ్ కేకన్

 మేడారం మహాజాతర రోడ్డు పనులు పూర్తి చేయాలి : ఎస్పీ రామ్నాథ్ కేకన్

తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతర రోడ్డు పనులను పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్​నాథ్​ కేకన్​ అన్నారు. మంగళవారం తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ లో వారు ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే కొత్తూరు మేడారం, కాల్వపల్లి మేడారం రహదారుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సంబధిత అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలాల్లో ఏర్పాట్లు చేయాలని, రోడ్లకు ఇరు వైపులా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. 

గోవిందరాజుల పూజారుల కోసం ఏర్పాటు చేస్తున్న వెయిటింగ్ హాల్ పనులు వెంటనే పూర్తి చేయాలని, జంపన్న వాగు, గద్దెల వద్ద టీటీడీ కల్యాణ మండపం, ఇంగ్లీష్ మీడియం స్కూల్​మూడు ప్రాంతాల్లో అంబులెన్స్ లు అందుబాటులో ఉండాలని కలెక్టర్​ సూచించారు. అంతకుముందు ఎస్పీ మేడారం కమాండ్​ కంట్రోల్​హాల్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతరకు బందోబస్తు కోసం వచ్చే సిబ్బందికి కావాల్సిన వసతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.