మేడారం మహాజాతర లో భక్తులకు మెరుగైన సేవలు అందించాలి

మేడారం మహాజాతర లో  భక్తులకు మెరుగైన సేవలు అందించాలి

ములుగు/ తాడ్వాయి, వెలుగు: వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు జరిగే మేడారం మహాజాతర లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని ములుగు కలెక్టర్ దివాకర సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో సమ్మక్క సారలమ్మ మేడారం జాతర -2026 ముందస్తు ప్రణాళిక తయారులో భాగంగా వైద్యారోగ్యశాఖ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. జాతరలో 30 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, కావాల్సిన వసతులను సమకూర్చుకోవాలని తెలిపారు. 

108 అంబులెన్స్​లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. అనంతరం డీఎంహెచ్​వో గోపాల్ రావు మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ములుగు జిల్లాను ముందు వరుసలో ఉంచాలని వైద్యాధికారులను కోరారు. కాగా, జిలాలోని 9 ఆశ్రమ పాఠశాలలకు బీఈఎల్ (​భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్)​ ఆధ్వర్యంలో కార్పొరేట్​సోషల్​రెస్పాన్సిబిలిటీ ద్వారా ​డిజిటల్​ క్లాస్​రూమ్​ పరికరాలను సమకూర్చారు.

 కలెక్టర్​ సమక్షంలో ములుగు మండలం జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలకు పరికరాలను అందజేశారు. దీంతో విద్యార్థులు కలెక్టర్​కు బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉండగా, తాడ్వాయి మండలంలోని సమ్మక్కసారలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను కలెక్టర్​ పరిశీలించారు. పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.