ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి : త్రిపాఠి

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి :  త్రిపాఠి

ములుగు, వెలుగు : ప్రజావాణిలో  వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని ములుగు కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అడిషనల్‌‌ కలెక్టర్లు వేణు గోపాల్, వెంకన్న, ఆర్డీవో సత్యపాల్‌‌రెడ్డితో కలిసి సోమవారం కలెక్టరేట్‌‌లో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు.

దరఖాస్తుదారులు చెప్పిన సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రసూనరాణి, ఏటీడీవో దేశిరం, ఆఫీసర్లు విజయభాస్కర్, రాములు, అరవింద్‌‌రెడ్డి, నాగేశ్వరరావు, శ్రీపతి,  సర్దార్ సింగ్, కుమారస్వామి పాల్గొన్నారు.