పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష

 పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష

ములుగు, వెలుగు: పోక్సో కేసులో 20 ఏండ్ల జైలుశిక్ష, రూ. 9 వేల జరిమానా విధిస్తూ ములుగు జిల్లా జడ్జి సూర్య చంద్రకళ మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ పి.శబరీశ్​ తెలిపిన ప్రకారం.. జిల్లాలోని వాజేడు మండలం బొమ్మన పల్లికి చెందిన సోడి సందీప్​2023లో అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

అనంతరం చార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. మంగళవారం వాదోపవాదాల తర్వాత నిందితుడు సందీప్ కు  జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అదేవిధంగా బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. కేసులో నిందితుడికి శిక్షపడేలా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ శబరీశ్​అభినందించారు.