తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో సీతాకోకచిలుకల సర్వేను శుక్రవారం నుంచి ప్రారంభించినట్లు ఎఫ్ఆర్ఓ నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైల్డ్ లైఫ్ ఏరియాలో ఎన్ని రకాల సీతాకోకచిలుకలు, మిడతలు ఉన్నాయోనని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రొఫెసర్లతో కలిసి ఎఫ్ డీఓ రమేశ్ఆధ్వర్యంలో 13 ఏరియాలో సర్వే చేస్తున్నామన్నారు. సర్వేలో 50 –60 రకాల సీతాకోకచిలుకలను గుర్తించామన్నారు. ఈనెల 9 వరకు సర్వే కొనసాగుతుందన్నారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ ఎన్జీవోకు చెందిన నాగేశ్వరరావు, డాక్టర్ చిత్తా శంకరన్, ఏటూరు నాగారం ఎఫ్ ఆర్ వో అబ్దుల్ రెహమాన్, పస్రా, తాడ్వాయి, రేంజ్ ఎఫ్ ఆర్ఓలు, ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు.
