- ములుగు డీఎస్పీ రవీందర్ వెల్లడి
వెంకటాపూర్/ గోవిందరావుపేట, వెలుగు : ములుగు జిల్లాలో చోరీ కేసును పోలీసులు చేధించి సొత్తును రికవరీ చేశారు. డీఎస్పీ ఎన్.రవీందర్సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన పుల్యాల రజిని గత శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి సమీపంలోని తల్లిగారి ఇంటికి వెళ్లి నిద్రపోయి, మరుసటి రోజు తెల్లారి ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగింది.
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ దయాకర్ దర్యాప్తు చేపట్టి 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఇందుకు క్లూస్‌టీమ్ గ్రామస్తుల సాయంతో దొంగలను గుర్తించి అదుపులోకి తీసుకుని 12తులాల బంగారం, రూ.2.10లక్షల నగదు, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.12లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు.
బుస్సాపూర్గ్రామానికి చెందిన కుక్కల రాజు, కండెల పద్మ, పెరుమాండ్ల భాగ్యలక్ష్మి ఆర్థిక ఇబ్బందులతోనే చోరీకి పాల్పడినట్లు తేల్చారు. కేసు చేధించిన పస్రా సీఐ దయాకర్, ఎస్ఐ కమలాకర్, సీసీఎస్, క్లూస్ టీమ్ సిబ్బందిని ఎస్పీ శబరీశ్, డీఎస్పీ రవీందర్ అభినందించారు.
