ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలకేంద్రంలోని ఫారెస్ట్ కాలేజీ పదో వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై కాలేజీ ప్రాంగణంలో మొక్క నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కాలేజీలో లెక్చరర్ల నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నుంచి 2021 వరకు డీన్‌గా సేవలందించిన, ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీ నిర్వహణలో గొప్ప పాత్ర పోసించారని కొనియాడారు. పరిపాలన, అకాడమీ ప్రమాణాల అభివృద్ధిపై నివేదిక ఇవ్వడానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులకు మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణ, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ ప్రతినిధులు డాక్టర్ దండ రాజిరెడ్డి, ప్రియాంక వర్గీస్, ఆశ, జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ రావు, డిప్యూటీ డైరెక్టర్ కవిత పాల్గొన్నారు.
