ములుగు మండలంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

ములుగు మండలంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


ములుగు/ తాడ్వాయి, వెలుగు: ములుగు మండలం మల్లంపల్లి వద్ద ఎస్ఆర్​ఎస్పీ కెనాల్​పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు త్వరగా పూర్తయితే మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ప్రస్తుతం ట్రాఫిక్​ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ సుధీర్​ రాంనాథ్​ కేకన్​వెల్లడించారు. 

సోమవారం బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎస్పీ ఎన్​హెచ్​ డీఈ కిరణ్ కుమార్, ఏఈ చేతన్ తో పనులపై చర్చించారు. మేడారం జాతరకు ప్రధాన మార్గమైన హనుమకొండ ములుగు రూట్ లో బ్రిడ్జి వద్ద వాహనాలకు అంతరాయం కలుగుతుందని, సకాలంలో పూర్తిచేయాలని ఎన్​హెచ్ అధికారులను కోరారు. అనంతరం ఆయన మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. క్యూలైన్​ గ్రిల్స్​ పనులను నాణ్యతతో పూర్తి చేయాలనిసూచించారు.

అధికారుల సూచనలు అర్థం చేసుకోవాలి..

మేడారంలో చిరు వ్యాపారులు అధికారుల సూచనలను అర్థం చేసుకుని, సహకరించాలని కలెక్టర్ దివాకర్, ఎస్పీ రామ్​నాథ్ కేకన్ కోరారు. మేడారం మహా జాతర సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులు భక్తుల రద్దీ దృష్ట్యా రోడ్డుకు 12 అడుగుల దూరంలో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.