వెంకటాపురం, వెలుగు: తెలంగాణ– ఛత్తీస్గడ్ సరిహద్దు కర్రెగుటల్లోని పనులు డెడ్లైన్వరకు పూర్తి చేయాలని ములుగు ఎస్పీ రామ్నాథ్కేకన్ అన్నారు. గురువారం ఆయన ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ తో కలిసి పనులను పరిశీలించారు.
ఎస్పీ మాట్లాడుతూ జూన్ లో వర్షాలు పడే అవకాశం ఉండడంతో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉందని, పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అంతకుముందు వాజేడు మండలంలోని ధాన్యం నిల్వల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శంకర్, వెంకటాపురం సీఐ రమేశ్, ఎస్సై తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
