రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి : ఆర్. కృష్ణయ్య

రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి : ఆర్. కృష్ణయ్య
  •     విద్యా విధానంపై సీఎం వైఖరి మార్చుకోవాలి: ఆర్. కృష్ణయ్య 

ముషీరాబాద్, వెలుగు: దేశ, రాష్ట్ర స్థితిగతులను మార్చే విద్యా విధానం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించేందుకు వీలుగా మేధావులు, విద్యార్థి సంఘాల నేతలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మంగళవారం బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో  లిబర్టీ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ ర్యాలీలో ఆర్. కృష్ణయ్య పాల్గొని, మాట్లాడారు. రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడే రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పథకాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా యథావిధిగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల జీవితాలు ఆగం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.