
ట్రాఫిక్ జామ్ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక ఆస్పత్రి నుంచి అరకిలోమీటర్ దూరంలో ఉన్న మరో ఆస్పత్రికి రావడానికి 20నిమిషాలు పట్టడంతో అంబులెన్స్ లోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
నేషనల్ మీడియా కథనం.. ప్రకారం ముంబైలోని వెస్ట్ మలద్ ప్రాంతానికి చెందిన జిగ్నేష్ (27)అనే యువకుడికి ఉదయం 10గంటల ప్రాంతంలో గుండె నొప్పి రావడంతో అతని తల్లిదండ్రులు అత్యవసర చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో సరైన వైద్యు సదుపాయాలు లేకపోవడంతో అక్కడి నుంచి మరో ఆస్పత్రికి జిగ్నిషే ను తీసుకెళ్లేందుకు అతని తల్లిదండ్రులు ప్రయత్నించారు. జిగ్నేష్ ను అంబులెన్స్ లోకి ఎక్కించి అరకిలోమీటర్ దూరంలో ఉన్న మరో ఆస్పత్రికి బయలు దేరారు. కానీ ఆస్పత్రి బయట విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో జిగ్నేష్ అంబులెన్స్ లో ప్రాణాలు కోల్పోయాడు.
కొడుకు మరణంపై కన్నీమున్నీరైన బాధితుడి తల్లి రంజనా..మలార్ ప్రాంతంలో రోడ్లు సరిగ్గా లేవని, ట్రాఫిక్ వల్ల తన కొడుకును కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకెవరికి కడుపుకోత మిగల్చకుండా రోడ్ల నిర్మాణాల్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది.