ముంబై: ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళుతున్న ఐసర్ టెంపో వెహికల్ కంటైనర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. 35 మందికి పైగా గాయపడ్డారు.
Palghar, Maharashtra: On the Mumbai–Ahmedabad National Highway, a road accident occurred near the Dhaniwari area when a tempo carrying wedding guests met with a major crash. Reportedly 12 people have died in the incident, while more than 35 others are said to be seriously… pic.twitter.com/cGppM5wOWJ
— IANS (@ians_india) May 18, 2026
కాసా ప్రాంతంలోని ధనివారి గ్రామం సమీపంలో పెళ్లి వేడుకకు వెళ్తున్న జనంతో ఉన్న టెంపో, అతివేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్కును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ముంబై-అహ్మదాబాద్ హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
బాపుగావ్ ఖడ్కిపాడ గ్రామానికి చెందిన బలరామ్ జైరామ్ దండేకర్ ఇంట్లో పెళ్లికి అతిథులను తీసుకు వెళుతున్న ఐసర్ టెంపో ఈ ప్రమాదానికి గురైంది. వేగంగా వస్తున్న కంటైనర్ ట్రక్కును టెంపో ఎదురుగా ఢీకొనడంతో.. తీవ్ర ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే కాసాలోని ఉప-జిల్లా ఆసుపత్రికి, ధుండల్వాడిలోని మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని ధృవీకరిస్తూ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆయన ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
టెంపోలో లిమిట్కు మించి ప్రయాణికులను తీసుకువెళుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మితిమీరిన వేగం, ఇరుకైన రహదారి, టెంపో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం.. ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా అనుమానిస్తున్నారు.
