
- సముద్రంలో గాలిస్తున్న పోలీసులు, రెండ్రోజులుగా దొరకని ఆచూకీ
ముంబై: ఓ యువ డాక్టర్ అటల్ సేతు బ్రిడ్జి మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. డిన్నర్‌కు వస్తున్నానని అమ్మతో చెప్పి హాస్పిటల్ నుంచి ఇంటికి బయల్దేరిన ఆయన ముంబై లోని హార్బల్ లింక్ బ్రిడ్జిపై కారు వదిలేసి సముద్రంలో దూకారు. పోలీసులు, రెస్క్యూ టీమ్స్ రెండు రోజులుగా గాలిస్తున్నా ఆయన జాడ దొరకలేదు.
ముంబైలోని జేజే ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఓంకార్ కవిట్నే(32) జులై 7న రాత్రి 9 గంటలకు డ్యూటీ ముగించుకుని ఇంటికి బయల్దేరారు. తల్లికి ఫోన్ చేసి ఇంటికి వచ్చాక భోజనం చేస్తానని చెప్పారు. అయితే మార్గ మధ్యలో అటల్ సేతు బ్రిడ్జి మీదికి వచ్చాక కారును అక్కడే పార్క్ చేసి సముద్రంలో దూకారు.