ముంబై డ్రగ్ మాఫియా ప్రధాన నిందితుడు హైదరాబాద్ లో అరెస్ట్

V6 Velugu Posted on Jan 20, 2022

ముంబై డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోనీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. టోనీని ముంబైలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు టోనీ. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబైలలో డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక గ్యాంగ్ ల ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్ లో 300 మందికిపైగా వీఐపీలకు టోనీ డ్రగ్స్ సరఫరా చేసిన్నట్లు పోలీసులు గుర్తించారు. టోనీతోపాటు 9 మంది డ్రగ్స్ తీసుకునే వారిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. టోనీ వద్ద నుంచి డ్రగ్స్ తీసుకున్నవారిలో..రాజకీయ నాయకుల పిల్లలు, వ్యాపారవేత్తల పిల్లలే అధికంగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి:

ఒమిక్రాన్.. మైల్డ్ అన్న ప్రచారం సరికాదు

రాజులు మెచ్చిన గాజుల షాప్

Tagged hyderabad police, Mumbai drug mafia, tony arrest, drug mafia don

Latest Videos

Subscribe Now

More News