ముంబై: ఆన్లైన్ కంటెంట్‌లో ఫేక్‌న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర సర్కారు ఏర్పాటు చేయదలుచుకున్న ఫ్యాక్ట్‌చెక్ యూనిట్‌కు చుక్కెదురైంది. ఇందుకోసం చేపట్టిన ఐటీ రూల్స్ సవరణలు రాజ్యాంగ విరుద్ధమని బాంబే హైకోర్టు వెల్లడించింది. ఫ్యాక్ట్‌చెక్ యూనిట్ ఏర్పాటు కోసం సవరించిన ఐటీ రూల్స్ చెల్లుబాటును సవాల్ చేస్తూ స్టాండప్కమెడియన్ కునాల్ కామ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.
ఫ్యాక్ట్‌చెక్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రానికి అధికారం ఇచ్చే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ నిబంధనలు–2023 రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19కు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ ఏఎస్ చందూర్కర్ వెల్లడించారు. ‘‘ఇందులోని విషయాలను నేను క్షుణ్నంగా పరిశీలించాను. ఈ రూల్స్ ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), 19 (భావప్రకటన స్వేచ్ఛ హక్కు)ను ఉల్లంఘిస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.