IPL 2025: ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ముంబై, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు.. కారణమిదే!

IPL 2025: ఐపీఎల్‌పై ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ముంబై, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు.. కారణమిదే!

పహల్గామ్ దాడికి ఏప్రిల్ 22న 26 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు మే 7న తెల్లవారుజామున "ఆపరేషన్ సిందూర్"ను ప్రారంభించాయి. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ఐపీఎల్ పై పడింది. ఇందులో భాగంగా మే 11న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వేదిక మార్చాల్సి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం (మే 11) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ను ముంబైలోని వాంఖడేకు మార్చడం జరిగింది.

పాకిస్థాన్ బోర్డర్ లో ఉన్న ధర్మశాల విమాశ్రమం మూసివేయడమే ఇందుకు కారణం. ఉద్రిక్తల పరిస్థుతుల మధ్య ఇక్కడ మ్యాచ్ జరపకూడదని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు సమాచారం. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న అనేక విమానాశ్రయాలలో ధర్మశాల ఒకటి. ఈ విమానాశ్రమాలను మే 10 ఉదయం 5:30 గంటల వరకు మూసివేస్తారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా బుధవారం(మే 7) తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఇండియా  దాడి చేసింది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, చండీగఢ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్ విమానాశ్రయాలు సైతం మూసివేయబడ్డాయి.

►ALSO READ | GT vs MI: మ్యాచ్ ఓటమికి కారణమైన పాండ్య.. రూ. 24 లక్షల జరిమానా విధించిన బీసీసీఐ

ధర్మశాల విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేయడం వలన ప్రస్తుతం ముంబైలోనే ఉన్న ముంబై ఇండియన్స్ ధర్మశాలకు చేరే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ధర్మశాలలోనే ఉండడంతో గురువారం (మే 8) మ్యాచ్ యధావిధిగా జరుగుతుంది. స్థానిక విమానాశ్రయం మూసివేయడానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ధర్మశాలకు చేరుకున్నందున ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది. ప్లే ఆఫ్స్ కు ముందు ముంబై, పంజాబ్, ఢిల్లీ జట్లకు మిగిలిన మ్యాచ్ కీలకం కానున్నాయి. 

మరిన్ని వార్తలు