PBKS vs MI: లక్ అంటే ఇలా ఉండాలి: ముంబైకి కలిసొస్తున్న ఐపీఎల్ ఫలితాలు.. పంజాబ్‌తో గెలిస్తే క్వాలిఫయర్ 1కు

PBKS vs MI: లక్ అంటే ఇలా ఉండాలి: ముంబైకి కలిసొస్తున్న ఐపీఎల్ ఫలితాలు.. పంజాబ్‌తో గెలిస్తే క్వాలిఫయర్ 1కు

ఐపీఎల్ 2025లో అదృష్టం అంటే ముంబై ఇండియన్స్ దే అని చెప్పుకోవాలి. ఒకదశలో ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందో లేదో అనుకున్న పరిస్థితి నుంచి ఏకంగా క్వాలిఫయర్ 1 మీద దృష్టి పెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిచి ప్లేయర్ ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న హార్దిక్ సేనకు ఆ తర్వాత ఇతర మ్యాచ్ ల ఫలితాలు కలిస్ వచ్చాయి. గ్రూప్ టాపర్ గా గుజరాత్ టైటాన్స్ వరుసగా లక్నో, చెన్నై చేతిలో ఓడిపోయింది. ప్లేయర్ ఆఫ్స్ కు చేరుకున్న తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సన్ రైజర్స్ షాక్ ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. 

ALSO READ | ENG vs IND: ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

వరుసగా నాలుగు మ్యాచ్ ల ఫలితాలు ముంబైకి కలిసి వచ్చాయి. ఈ మూడు జట్లు కూడా టేబుల్ బాటమ్ లో ఉన్న జట్లపై ఓడిపోవడం విశేషం. దీంతో ముంబై ఖచ్చితంగా ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుందనునకుంటే క్వాలిఫయర్ 1 ఆడేందుకు ఛాన్స్ వచ్చింది. సోమవారం (మే 26) పంజాబ్ కింగ్స్ తో ముంబై తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్ లో గెలిస్తే క్వాలిఫయర్ 1 ఆడుతుంది. జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

మరోవైపు పంజాబ్ కింగ్స్ ది కూడా అదే పరిస్థితి. భారీ స్కోర్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ తో ఓడిపోయిన పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలిస్తే టాప్-2 లో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకొని క్వాలిఫయర్ 1 కు అర్హత సాధిస్తుంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫయర్ 1 ఆడతాయి. క్వాలిఫయర్ 1 ఆడే జట్లకు ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఓడిపోయిన జట్టు ఫైనల్ చేరడానికి క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంటుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి క్వాలిఫయర్ 1 ఆడతారో ఎవరు ఎలిమినేటర్ ఆడతారో చూడాలి. 

మరిన్ని వార్తలు