ముంబై ఇండియన్స్ ప్రక్షాళన..13 మంది ఆటగాళ్లు రిలీజ్

ముంబై ఇండియన్స్ ప్రక్షాళన..13 మంది ఆటగాళ్లు రిలీజ్

గత ఐపీఎల్లో ఘోరంగా విఫలమైన ప్లేయర్లను ముంబై ఇండియన్స్ వదిలేసుకుంది. రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా 13 మందిని ఎంఐ రిలీజ్ చేసింది. కీరన్ పోలార్డ్‌తో పాటు అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, జయదేవ్ ఉనాద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ది, రిలే మెరిడిత్, సంజయ్ యాదవ్‌,  డానియల్ సామ్స్, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్‌లను ఐపీఎల్ మినీ వేలంలోకి విడుదల చేసింది.దీంతో ముంబై పర్స్‌లో రూ.20.5 కోట్లు మిగిలాయి. ఈ డబ్బుతో డిసెంబర్ 23న జరిగే మినీవేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. గతేడాది బెంగుళూరుకు ఇచ్చిన జాసన్ బెహ్రెండార్ఫ్‌ను ముంబై మళ్లీ తీసుకుంది. అయితే పొలార్డ్ను ముంబై బ్యాటింగ్ కోచ్గా నియమించింది. 

రిటైన్ ఆటగాళ్లు ఎవరంటే...
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టాన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రేవిస్, జోఫ్రా ఆర్చర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్, ఆకాశ్ మద్వాల్‌లను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది. వీరితో పాటు..కోర్ టీమ్‌ను ముంబై యాజమాన్యం కొనసాగించింది. 

ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు: రోహిత్ శర్మ(కెప్టెన్), రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్,  టీమ్ డేవిడ్,ఇషాన్ కిషన్, బుమ్రా, అర్జున్ టెండూల్కర్,  ట్రిస్టాన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రేవిస్, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్, ఆకాశ్ మద్వాల్‌, జాసన్ బెహ్రెండార్ఫ్

ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసిన ప్లేయర్లు: అన్‌మోల్ ప్రీత్ సింగ్,  మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్‌, జయదేవ్ ఉనాద్కత్, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ది, రిలే మెరిడిత్, సంజయ్ యాదవ్‌, డానియల్ సామ్స్,