
చెన్నై: ప్లే ఆఫ్స్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయంతో మెగా లీగ్‌కు దూరమైన విఘ్నేశ్ పుతూర్ స్థానంలో లెగ్ స్పిన్నర్ రఘు శర్మను తీసుకున్నారు. ముంబై సహాయక బౌలింగ్ యూనిట్‌లో ఉన్న అతను ఇప్పుడు ప్రధాన జట్టులో చేరాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో రఘు పంజాబ్, పుదుచ్చెరీకి ప్రాతినిధ్యం వహించాడు. 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 19.59 యావరేజ్‌తో 57 వికెట్లు తీశాడు. 7/56 అతని అత్యుత్తమ గణాంకాలు.
రెండు కాళ్ల పిక్క ఎముకల్లో ఒత్తిడి కారణంగా విఘ్నేశ్ మిగతా మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడని ముంబై ఫ్రాంచైజీ వెల్లడించింది. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు పాల్పడిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. నిర్ణీత టైమ్‌లో వేయాల్సిన ఓవర్ల కోటాను పంజాబ్ బౌలర్లు పూర్తి చేయలేకపోవడంతో నిర్వాహకులు ఈ చర్య తీసుకున్నారు. చేతి వేలి ఫ్రాక్చర్ కారణంగా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.