IPL 2024: ముంబై ఇండియన్స్‌కు హ్యాట్సాఫ్: 20 వేల మంది పిల్లలకు ఫ్రీ ఎంట్రీ

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు హ్యాట్సాఫ్: 20 వేల మంది పిల్లలకు ఫ్రీ ఎంట్రీ

ఐపీఎల్ లో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 7) మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ లో ఒక ప్రత్యేకత ఉంది. ముంబై ఇండియన్స్ ఈ హై వోల్టేజ్ క్లాష్ ను పిల్లలకు అంకితం చేయాలనుకుంటున్నారు. ఆ రోజు ESA (అందరికీ విద్య మరియు క్రీడలు) దినోత్సవంగా జరుపుకుంటామని ముంబై ఇండియన్స్ శుక్రవారం (ఏప్రిల్ 5) ప్రకటించింది.

ఇందులో భాగంగా ముంబై నగరంలోని NGOల నుండి 20,000 మంది పిల్లలను స్టేడియంలో ఫ్రీగా మ్యాచ్ ను చూసేందుకు అనుమతిస్తున్నారు. ముంబై ఇండియన్స్ 2010 నుండి రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో (ESA) వెనుకబడిన పిల్లలకు క్రీడలు,  విద్యకు సపోర్ట్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తుంది. 2010 నుంచి ప్రతి సీజన్ లో వారి సొంత మైదానంలో ఒక మ్యాచ్ కు ESA డేను జరుపుతూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. 

ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఇంకా బోణీ కొట్టలేదు. ఆడిన 3 మ్యాచ్ ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గుజరాత్ తో గెలిచే మ్యాచ్ లో ఓడిన హార్థిక్ సేన..ఆ తర్వాత వరుసగా సన్ రైజర్స్, రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ జట్టులో చేరడంతో ముంబై గెలుపుపై ధీమాగా కనిపిస్తుంది. మరి రేపు సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే మ్యాచ్ లో గెలిచి పాయింట్ల ఖాతా ఓపెన్ చేస్తుందో లేదో చూడాలి.