ఫైనల్లో ముంబై..చెన్నైపై గ్రాండ్ విక్టరీ

ఫైనల్లో ముంబై..చెన్నైపై గ్రాండ్ విక్టరీ

చెన్నై: హోరాహోరీ తప్పదనుకున్న పోరు చప్పగా ముగిసింది. సొంతగడ్డపై చెలరేగుతారనుకున్న చెన్నైహీరోలు చెత్త బ్యాటింగ్‌ తో జీరోలయ్యారు. ధనాధన్‌ సమరం చూద్దామని స్టేడియానికి పోటెత్తిన అభిమానులను ఉసూరుమనిపించారు. లో స్కోరింగ్‌ మ్యాచ్‌ లో గెలిచిన ముంబై సునాయాస విక్టరీతో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదోసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లింది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌ పోరులో రోహిత్‌ సేన 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది. టాస్‌ గెలిచి ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 131 రన్స్‌ మాత్రమే చేసింది. అంబటి రాయుడు (37 బంతుల్లో 3 ఫోర్లు,సిక్సర్‌ తో 42 నా టౌట్‌ ), ధోనీ(29 బంతుల్లో 3సిక్సర్లతో 37 నాటౌట్‌ ) రాణించారు. ముంబై బౌలర్లలో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్‌ (2/14) రెండు వికెట్లు తీయగా,క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా, జయంత్‌ యాదవ్‌ చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం సూర్యకుమార్‌యాదవ్‌ (54 బంతుల్లో 10 ఫోర్లతో 71 నా టౌట్‌ )అజేయ హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో ముంబై18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 132 రన్స్‌ చేసి ఈజీగా గెలిచింది. చెన్నై బౌలర్లలో ఇమ్రాన్‌ తాహిర్‌ రెండువికెట్లు తీశాడు. సూర్యకుమార్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ దిమ్యాచ్‌ అవార్డు దక్కింది.

సూర్య ప్రతాపం

అద్భుత బౌలింగ్‌ తో ప్రత్యర్థిని కట్టడి చేసిన ముంబై..సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ మెరుపులతో చిన్నటార్గెట్‌ ను సునాయసంగా ఛేజ్‌ చేసింది.నిజానికి ఛేజింగ్‌ లో ముంబైకి మంచి ఆరంభమేమీ దక్కలేదు.నాలుగు ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి డీలాపడింది. తొలి బంతిని బౌండరీకి తరలించి ఖాతా తెరచిన రోహిత్‌ శర్మ(4)ను నెక్ట్స్‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే దీపక్‌ చహర్‌ఎల్బీ చేశాడు. ఫామ్‌ లో ఉన్న మరో ఓపెనర్‌ డికాక్‌ (8)సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిట్‌ కే పరిమితమయ్యాడు. నాలుగో ఓవర్లో హర్భజన్‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎక్స్‌ ట్రా కవర్‌ దిశగా ఆడిన డికాక్‌ ..డుప్లెసిస్‌ కు దొరికిపోయాడు. ఈ దశలో సూర్యకుమార్‌ తో కలిసి ఇషాన్‌ కిషన్‌ (28) బాధ్యతగా ఆడాడు.మూడో వికెట్‌ కు 80 రన్స్‌ జోడించిన ఈ జోడి ముంబై విజయాన్ని ఖాయం చేసింది. తొలుత కాస్త నెమ్మదిగా ఆడిన ఈ ఇద్దరు క్రీజులో కుదురుకున్నాక బ్యాట్లకు పని చెప్పారు. బ్రావో, తాహిర్‌ , జడేజా పొదుపు గాబౌలింగ్‌ చేయడంతో పది ఓవర్లకు ముంబై 69/2తోనిలిచింది. అయితే , తాహిర్‌ వేసిన 11వ ఓవర్‌ లోరెండు ఫోర్లు కొట్టిన సూర్యకుమార్‌ జోరు పెంచాడు.స్వేచ్ఛగా ఆడిన అతను తాహిర్‌ వేసిన 14వ ఓవర్లోమరో బౌండ్రీ బాది హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.అయితే ఇదే ఓవర్లో వరుస బంతుల్లో ఇషాన్‌ తోపాటు క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్ యా (0)ను ఔట్‌ చేసిన తాహిర్‌ ప్రత్యర్థికి షాకిచ్చా డు. చెన్నై శిబిరంలో ఆశలు రేపాడు. అయితే చెన్నైకి మరో అవకాశమివ్వని సూర్యకుమార్‌ .. హార్దిక్‌పాండ్ యా(13 నాటౌట్‌ )తో కలిసి గెలుపు లాంఛనం పూర్తి చేశాడు.

ముంబై స్పిన్నర్ల దెబ్బ

అసలే ఫైనల్ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం జరుగుతున్న బిగ్‌ ఫైట్‌ .టాస్‌ గెలిచిన కెప్టెన్‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్ యాటింగ్‌ ఎంచుకున్నాడు.భారీ స్కోరు ఖాయమని పసుపు జట్టు అభిమానులు ఆశించారు. కెప్టెన్‌ ధోనీ చివరి బంతి వరకు క్రీజులోఉన్నాడు. కానీ, కోరుకున్న జోరు లేదు. ఆశించిన పరుగుల వరద లేదు. నెమ్మదిగా మొదలైన సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌ చివరి దాకా అదే నిరసంగా సాగింది.ధోనీ, రాయుడు కాస్త పోరాడడంతో ప్రత్యర్థి ముందుస్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై ఇన్నింగ్స్‌ ను ముంబై స్పిన్నర్లు తీవ్రంగా దెబ్బకొట్టారు. సొంతగడ్డపై ఆడుతున్న చెన్నై బ్యాట్స్‌ మెన్‌ ను గింగిరాలు తిరిగే బంతులతో తికమకపెట్టా రు. పవర్‌ ప్లేలోపే చెన్నై టాపార్డర్‌ మొత్తాన్ని పెవిలియన్‌ చేర్చారు. ముంబై బౌలింగ్‌ దెబ్బకు డుప్లెసిస్‌ (6), సురేశ్‌ రైనా(5), షేన్‌ వాట్సన్‌ (10) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. రా హుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ లో కట్‌ షాట్​ ఆడిన డుప్లెసిస్‌పాయింట్‌ లో సబ్‌ స్టిట్యూట్ ఫీల్డర్‌ అన్మోల్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌ కు సులువైన క్యాచ్‌ ఇచ్చా డు. వన్‌ డౌన్‌ లో వచ్చి న రైనా నాలుగో ఓవర్లో భారీ షాట్‌ ఆడి స్పిన్నర్‌ జయంత్‌యాదవ్‌ కు రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌ ఇచ్చా డు. రెండు బౌండ్రీలుకొట్టి ఆశలు రేపిన వాట్సన్‌ .. క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌ లోఅనవసర షాట్‌ ఆడి మిడాన్‌ లో జయంత్‌ కు చిక్కా డు.దీంతో ఆరు ఓవర్లకు 32/3తో కష్టాల్లో చిక్కుకున్న చెన్నైని మురళీ విజయ్‌ (26), అంబటి రాయుడు ఆదుకునే ప్రయత్నం చేశారు. రాయుడు జాగ్రత్తగా ఆడగా.. క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌ లో రెండు బౌండరీలు కొట్టిన విజయ్‌ .. చహర్‌ వేసిన ఏడో ఓవర్‌ లో మరోఫోర్‌ బాది టచ్‌ లో కనిపించాడు. పది ఓవర్లకు చెన్నై50/3తో నిలిచింది. మలింగ బౌలింగ్‌ లో ఫోర్‌ రాబట్టిన రాయుడు కూడా వేగం పెంచడంతో చెన్నై కుదురుకున్నట్టే అనిపించింది. కానీ, స్వేచ్ఛగా ఆడుతున్నవిజయ్‌ ను స్టం పౌట్‌ చేసిన రా హుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోమ్‌ టీమ్‌ కుమళ్లీ షాకిచ్చా డు. నాలుగో వికెట్‌ కు రాయుడితోవి జయ్​ 33 రన్స్‌ జోడించాడు.

ధోనీ, రాయుడు పోరాటం

విజయ్‌ ఔటయ్యే టైమ్‌ కు చెన్నై స్కోరు 13 ఓవర్లకు 68/4. జయంత్‌ వేసిన తర్వాతి ఓవర్లో చెరో సిక్సర్‌ కొట్టిన ధోనీ, రాయుడు చప్పగా సాగుతున్న ఇన్నింగ్స్‌ కు ఊపు తెచ్చారు. అయితే ఆ జోరు ఆ తర్వాత కొనసాగలేదు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌చేయడంతో హోమ్‌ టీమ్‌ మళ్లీ తడబడింది. క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,రా హుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్‌ , బుమ్రా కట్టడి చేయడంతో వంద పరుగుల మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరడానికి ధోనీసేన 18వ ఓవర్‌వరకు వేచి చూడాల్సి వచ్చింది. బుమ్రా వేసిన 18వఓవర్‌ తొలి బంతిని బౌండరీగా మలచిన రాయుడు జట్టు స్కోరును వంద పరుగుల మార్కు దాటించాడు.మలింగ వేసిన19వ ఓవర్‌ లో ధోనీ రెండు భారీ సిక్ స్‌ లుకొట్టాడు. కానీ, చివరి ఓవర్లో బుమ్రా 9 రన్స్‌ మాత్రమే ఇచ్చి చెన్నైని అడ్డుకున్నాడు. ధోనీ, రాయుడు ఐదోవికెట్‌ కు 48 బంతుల్లో 66 రన్స్‌ జోడించారు.

 స్కోర్‌ బోర్డు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ : డుప్లె సిన్‌ (సి) సబ్‌ / అన్మో-ల్‌ ప్రీత్‌ (బి) రాహుల్‌ 6, వాట్సన్‌ (సి) జయంత్‌ (బి) క్రునాల్‌ 10, రైనా (సి అండ్‌ బి) జయంత్‌ 5, విజయ్‌ (స్టంప్డ్‌ ) డికాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బి) రాహుల్‌ 26, రాయుడు(నాటౌట్‌ ) 42, ధోనీ (నాటౌట్‌ ) 37; ఎక్స్‌ ట్రాలు:5; మొత్తం:20 ఓవర్లలో 131/4

ముంబై ఇండియన్స్‌ : రోహిత్‌ (ఎల్బీ)దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4,డికాక్ (సి) డుప్లె సిస్‌ (బి) హర్భజన్‌ 8, సూర్యకు-మార్‌ (నాటౌట్‌ ) 71, కిషన్‌ (బి) తాహిర్‌ 28, క్రునాల్‌ (సి అండ్‌ బి) తాహిర్‌ 0, హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌ ) 13:ఎక్స్‌ ట్రాలు : 8 ; మొత్తం : 18.3 ఓవర్ల లో 132/4