మహారాష్ట్రలో ఆంక్షలు మరింత కఠినం

మహారాష్ట్రలో ఆంక్షలు మరింత కఠినం

ముంబై : దేశంలో నమోదవుతున్న ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర టాప్ ప్లేస్ లో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు అత్యధికంగా 108 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ముంబై దాదార్ (వెస్ట్)లోని ఓ ల్యాబ్ లో పనిచేస్తున్న 12 మంది సిబ్బందికి కరోనా సోకింది. వారందరికీ పాజిటివ్ నిర్థారణ కావడంతో బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ల్యాబ్ ను సీజ్ చేశారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలు కఠినం చేసింది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు ముంబైలో 144 సెక్షన్ అమలుచేస్తోంది. 

ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా అహ్మదాబాద్ జిల్లా యంత్రాంగం నో వ్యాక్సిన్ నో ఎంట్రీ ఆర్డర్ జారీ చేసింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉన్నవారినే షాపింగ్ మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, మ్యారేజ్ హాళ్లు, వ్యవసాయ మార్కెట్లలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు విదేశీ ప్రయాణీకుల విషయంలో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. దుబాయ్ నుంచి వచ్చే ప్యాసింజర్లు 7 రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించింది. 

మరిన్ని వార్తల కోసం..

దేశంలో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు

ఓటీటీ బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాస్.. నాగార్జునే హోస్ట్