మాస్క్ కంపల్సరీ.. లేదంటే జైలే

మాస్క్ కంపల్సరీ.. లేదంటే జైలే

ముంబై: కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి దాటడంతో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా ముంబైలో ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బీఎంసీ కమిషనర్ బుధవారం ఆర్డర్ జారీ చేశారు. ఇంటి నుంచి కాలు బయట పెడితే మాస్క్ లేదా కర్చిఫ్ తప్పకుండా వాడాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే వారు జైలు శిక్షకు గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. మహారాష్ట్రలో వెయ్యికిపైగా కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనే 782 కేసులు రికార్డయ్యాయి. 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వైరస్ మరింత విస్తరించకుండా మున్సిపల్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.