సోషల్ మీడియాలోనే ఎన్నికల ప్రచారం

సోషల్ మీడియాలోనే ఎన్నికల ప్రచారం

ముంబై అభ్యర్థి పేపర్ లెస్ క్యాంపెయిన్

ముంబై: ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు.. పాంప్లెట్లు పంచడం, రోడ్ షోలు, ర్యాలీ లు, ఇంటింటికీ ప్రచారం చేయడం సాధారణమే. అయితే ఇవన్నీ ప్రజలకు బోర్ కొట్టించే ఔట్ డేటెడ్ విధానాలే అంటూ ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి అఫ్తాబ్ ఖాన్.. వాట్సాప్ , సోషల్ మీడియానే ప్రచారాస్త్రంగా ఎంచుకున్నా రు. ఇలా చేస్తే పేపర్ సేవ్ అవుతుందంటూ తన మేనిఫెస్టోను కూడా వాట్సాప్ ద్వారా ఓటర్లకు పంపిస్తున్నా రు. తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ యూట్యూబ్, ఫేస్ బుక్ లలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. అంతేకాదు తనకు ఒక్క  రూపాయివిరాళం ఆన్​లైన్ ​ద్వారా పంపించాలని రిక్వెస్ట్ పెడుతున్నారు. ఇలా వచ్చిన మొత్తాన్ని ఎలక్షన్​ కమిషన్​కు, పేద పిల్లలకు ఖర్చు పెడతానని చెబుతున్నారు.

‘‘ఈ కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియానువాడుతున్నారు. ఇప్పుడదే ట్రెండ్ నడుస్తోంది. భారీసభలు, రోడ్ షోలు చేసేందుకు నా దగ్గర డబ్బుల్లేవు. 2009లో పోటీ చేసి ఇంటిం టికీ  ప్రచారం చేస్తే 560 ఓట్లు పడ్డాయి. నా కూతురు ఇచ్చిన సూచనతో ప్రచారానికి ఈ సారి సోషల్ మీడియాను ఎంచుకున్నాను” అని ఖాన్ చెప్తున్నారు. కాం గ్రెస్ నేత సంజయ్ నిరుపమ్, శివసేన అభ్యర్థి గజానన్ కృతికార్ లతో తలపడుతున్న ఖాన్ ఈ సారి తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం  చేస్తున్నారు.