6వేల కిలోల ఇనుప వంతెన చోరీ.. నలుగురు అరెస్ట్

6వేల కిలోల ఇనుప వంతెన చోరీ.. నలుగురు అరెస్ట్

ముంబైలోని శివారు ప్రాంతంలో డ్రైన్‌పై ఉంచిన 6వేల కిలోల ఇనుప వంతెనను దొంగిలించినందుకు గానూ నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 90 అడుగుల పొడవైన మెటల్ నిర్మాణం కోసం యుటిలిటీ కంపెనీ అదానీ ఎలక్ట్రిసిటీ.. భారీ విద్యుత్ తీగలను తరలించడానికి ఉంచిందని బంగూర్ నగర్ పోలీసులు చెప్పారు.

డ్రెయిన్‌పై శాశ్వత వంతెన నిర్మించాక.. తాత్కాలిక నిర్మాణాన్ని కొన్ని నెలల క్రితమే మరోచోటికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే జూన్ 26న తాత్కాలిక వంతెన కనిపించకుండా పోయిందని, దీంతో విద్యుత్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఘటనా స్థలంలో సీసీటీవీ కెమెరాలు లేనందున, సమీపంలోని ప్రాంతాల్లో అమర్చిన నిఘా కెమెరాల ఫుటేజీని స్కాన్ చేసిన పోలీసులు.. జూన్ 11న ఆ దిశగా పెద్ద వాహనం వెళ్లిన్నట్లు గుర్తించారు.

లొకేషన్‌ను గుర్తించి నిందితులను పట్టుకున్నారు...

పోలీసులు ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ట్రాక్‌ చేశారు. "వాహనంలో గ్యాస్ కట్టింగ్ మిషన్లు ఉన్నాయి, అవి వంతెనను కూల్చివేసేందుకు, 6వేల కిలోల బరువున్న ఇనుమును దొంగిలించడానికి ఉపయోగించబడతాయి" అని అధికారులు తెలిపారు. వంతెన నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ ఉద్యోగి ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయినట్టుగా గుర్తించిన పోలీసులు... గత వారమే సిబ్బందిని, అతని ముగ్గురు సహచరులను అరెస్టు చేశారు. అంతే కాకుండా సైట్ నుంచి దొంగిలించిన మెటీరియల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.