ముగ్గురు పోలీసుల సస్పెన్షన్

ముగ్గురు పోలీసుల సస్పెన్షన్

దోపిడీ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు ముంబై పోలీసులు. పోలీస్ అధికారులు ఓం వాంగేట్, నితిన్ కదమ్, సమాధాన్ జమ్దాడేను ముంబై పోలీసులు సస్పెండ్ చేశారు. దోపిడీ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఓం వాంగేట్‌ను అరెస్టు చేశారు. స్థానిక కోర్టు వాంగేట్‌ను మార్చి 15 వరకు పోలీసు కస్టడీ విధించారు. లోకమాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా వాంగేట్ పనిచేస్తున్నారు. అంగడియాల నుండి ఆయన డబ్బులు  వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

వాంగేట్ ముందస్తు బెయిల్ కోసం బాంబే హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తును ఆయన ఉపసంహరించుకున్నారు. అంతకుముందు, క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సిఐయు) ఫిబ్రవరి 19 న పిఐ నితిన్ కదమ్, పిఎస్ఐ సమాధాన్ జమ్దాదేలను అరెస్టు చేసింది.