హౌ ఈజ్ ద డిస్టెన్స్‌?.. 6 ఫీట్‌ సార్!

హౌ ఈజ్ ద డిస్టెన్స్‌?.. 6 ఫీట్‌ సార్!

సోషల్ డిస్టెన్సింగ్‌పై ఇన్‌స్టాలో ముంబై పోలీసుల పోస్ట్‌

ముంబై: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్రలో వైరస్ పాజిటివ్‌ల సంఖ్య చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. వ్యాక్సిన్ రావడానికి ఇంకా టైమ్ పడుతుందని సైంటిస్టులు చెబుతున్న ప్రస్తుత తరుణంలో.. కరోనా నుంచి సేఫ్‌గా ఉండటానికి సోషల్ డిస్టెన్సింగ్ కీలకం అయింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు సోషల్ డిస్డెన్సింగ్ అవసరం గురించి ప్రజలకు గుర్తు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియేటివ్‌గా ఓ పోస్ట్‌ పెట్టారు. ఇంపార్టెంట్ట్‌ మెసేజ్‌లను సోషల్ మీడియా ద్వారా క్రియేటివ్‌గా చెప్పడంలో ముంబై పోలీసు డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరుంది.

View this post on Instagram

How’s the distance:

A post shared by Mumbai Police (@mumbaipolice) on

ఈసారి ముంబై పోలీసులు ఒక హిందీ సినిమాలోని డైలాగ్‌ను బేస్‌గా తీసుకొని సోషల్ డిస్టెన్సింగ్ ఇంపార్టెన్స్‌ను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టారు. బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విక్కీ కౌశల్ నటించిన ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఫిల్మ్‌లోని ‘హౌ ఈజ్ ద జోష్’ను ప్రేరణగా తీసుకొని.. ‘హౌ ఈజ్ ద డిస్టెన్స్?’ అనే ప్రశ్నకు ‘6 ఫీట్, సార్’ అని బదులిచ్చేలా మీమ్‌ను రూపొందించారు. దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ద్వారా ప్రజలు ఒకరి నుంచి మరొకరు కనీసం 6 అడుగుల దూరం పాటించాలని ముంబై పోలీసులు సందేశం ఇచ్చారు. అలాగే విక్కీ కౌశల్‌తో పాటు మరో నటుడు ఉన్న ఆ మీమ్‌లో ఇద్దరి ముఖాలకు మాస్క్స్‌లు కట్టినట్టుగా ఎడిట్ చేశారు. ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది.