ఓటేయమంటూ చైతన్య ప్రభు ర్యాప్ సాంగ్…

ఓటేయమంటూ చైతన్య ప్రభు ర్యాప్ సాంగ్…

ముంబైలోని ఓ ర్యాప్ టీం ప్రజలందరూ ఓటేయాలంటూ తమదైన స్టైల్లో అవగాహన కల్పించింది.  వారికి వచ్చిన ర్యాప్ పద్ధతిలో ఈ అవేర్ నెస్ తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో తమ ర్యాంప్ సాంగ్ పాడి వినిపించారు.

‘మార్క్ యువర్ ప్రెసెన్స్’  టీం ఫౌండర్ చైతన్య ప్రభు ఆధ్వర్యంలో ఈ పాట రూపొందింది. ప్రజల్లో ఓటేయడానికోసం తమ ర్యాప్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చైతన్య ప్రభు చెప్పారు. ప్రజలకు సేవచేసే నాయకులకు ఓటేయకుంటే.. అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తారని…. ఓటేయడానికి మాత్రం లేజీగా ఉంటారని.. అలా చేయొద్దని.. మంచి నాయకులను ఎన్నుకుని ఓటేస్తేనే దేశంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు.  ప్రతీ ఒక్కరూ ఓటేయాలని  కోరారు.