వంట గది లేదా.. : ఏడాదిలో స్విగ్గీ నుంచి రూ.42 లక్షల ఫుడ్ ఆర్డర్

వంట గది లేదా.. : ఏడాదిలో స్విగ్గీ నుంచి రూ.42 లక్షల ఫుడ్ ఆర్డర్

ముంబై నివాసి 2023లో స్విగ్గి నుంచి రూ. 42.3 లక్షల విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లు ఆన్‌లైన్ ఫుడ్-డెలివరీ యాప్ డిసెంబర్ 14న తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2023 ముగిసే సమయానికి, స్విగ్గీ తన వార్షిక ఫుడ్ డెలివరీ నివేదికను ఆవిష్కరించింది. ముంబైకి చెందిన ఒక కస్టమర్ రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్‌లు చేశారు (ఇది CTC కాదు) అని Swiggy తన నివేదికలో పేర్కొంది.
ఈ రీక్యాప్ వివిధ వంటకాలు, కేకులు, గులాబ్ జామూన్, పిజ్జాలు వంటి ఆహార పదార్థాల వివరాలను కూడా అందించింది.

భారతీయులు ఎక్కువగా బిర్యానీని ఇష్టపడతారనే ఇప్పటికే చాలా నివేదికలు స్పష్టమైన గణాంకాల ద్వారా నిరూపితమైంది. ఏడాదిలో సెకనుకు 2.5సర్వింగ్ లతో బిర్యానీని ఆర్డర్ చేయడమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. 2023 కూడా బిర్యానీకి డిమాండ్, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అత్యధిక మంది బిర్యానీని ఆర్డర్ చేయడంతో ఎనిమిదోసారి కూడా స్విగ్గీ ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఒక హైదరాబాద్ లోని ఓ ఆహార ప్రియుడు.. సంవత్సరంలో మొత్తం 1,633 బిర్యానీలను ఆర్డర్ చేశాడు. అంటే సగటున ప్రతి రోజు నాలుగు ప్లేట్‌ల కంటే ఎక్కువన్నమాట.

చికెన్ బిర్యానీ చాలా మందికి హాట్ ఫేవరెట్‌గా కొనసాగుతుండగా, శాఖాహారులు సైతం తమ ఉనికిని చాటుకుంటున్నారు. చికెన్ కౌంటర్‌లో ప్రతి 5.5కి ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ అవుతోంది. హై-వోల్టేజ్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా చండీగఢ్‌కు చెందిన ఒక కుటుంబం ఒకేసారి 70 ప్లేట్‌ల కోసం ఆర్డర్ చేయడమనేది బిర్యానీపై ఏ స్థాయిల్ క్రేజ్ ఉందో తెలుస్తోంది.