100 రోజుల తర్వాత ముంబైలో కేసులు తగ్గినయ్‌

100 రోజుల తర్వాత ముంబైలో కేసులు తగ్గినయ్‌
  • ట్వీట్‌ చేసిన ఆదిత్యథాక్రే

ముంబై: ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదవడంతో వణికిపోతున్న ముంబై వాసులకు అధికారులు గుడ్‌ న్యూస్‌ చెప్పారు అధికారులు. దాదాపు 100 రోజుల తర్వాత కేసులు తగ్గాయి అని ప్రకటించారు. ప్రతి రోజు దాదాపు 800 నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండగా.. మంగళవారం 700 పాజిటివ్‌ కేసులు వచ్చాయని అధికారులు చెప్పారు. 8,776 శ్యాంపిల్స్‌ను టెస్ట్‌ చేయగా.. 700 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు చెప్పారు. దీనిపై మంత్రి ఆదిత్య థాక్రే కూడా ట్వీట్‌ చేశారు. “ గుడ్‌ న్యూస్‌ం ఈ రోజు ముంబైలో 700 కేసులు మాత్రమే వచ్చాయి. మూడు నెలల తర్వాత పెద్ద రిలీఫ్‌ ఇది. 8776 టెస్టులు చేశాం. వైరస్‌ను పూర్తిగా తరిమికొడదాం. హెచ్చరిక: గార్డును నిరాశపరచవద్దు. మాస్క్‌ను తీసేయొద్దు. కేవలం కేసుల సంఖ్యను మాత్రమే తగ్గించండి” అని ఆదిత్య థాక్రే అన్నారు. మహారాష్ట్రలో సోమవారం 7,924 కేసులు నమోదు కాగా.. 227 మంది చనిపోయారు. వాటిలో ముంబైలోనే 1021 కేసులు నమోదుకాగా.. 39 మంది చనిపోయారు. ముంబైలో ఇప్పటి వరకు 6,132 మంది చనిపోయారు.