ముంబైలో సింధూర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సీఎం ఫడ్నవీస్

ముంబైలో సింధూర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన సీఎం ఫడ్నవీస్

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో  సిందూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రారంభించారు. ముంబై సెంట్రల్‌‌‌‌‌‌‌‌ రైల్వేలోని ఈస్ట్, వెస్ట్ ట్రాక్స్‌‌‌‌‌‌‌‌ను కలుపుతూ 150 ఏండ్ల క్రితం నిర్మించిన కార్నాక్ బ్రిడ్జి (ఆర్వోబీ) శిథిలావస్థకు చేరడంతో దాన్ని రీకన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ చేసి, ఇలా సిందూర్ బ్రిడ్జిగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్  మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మన ఆర్మీ ఎంతో ధైర్యసాహసాలను ప్రదర్శించింది. మన సైనికుల ధైర్యానికి గుర్తుగా బ్రిడ్జి పేరును సిందూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తున్నం” అని వెల్లడించారు.